చలో.. ఇక పని మొదలుపెడదాం : కీర్ స్టార్మర్

చలో.. ఇక పని మొదలుపెడదాం :  కీర్ స్టార్మర్
  • తొలి కేబినెట్ మీటింగ్​లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 

లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్ శనివారం తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లా డారు. ‘‘మనం చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. వెంటనే పని మొదలుపెడదాం. బ్రిటన్ ను పునర్నిర్మిద్దాం” అని చెప్పారు. కింగ్ చార్లెస్ తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, ప్రధానిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

కాగా, బ్రిటన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్ని కల్లో రిషి సునాక్ ఆధ్వర్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 ఆహ్వానం మేరకు కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.