దేశంలోని ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చే యోచనలో కేంద్రం..!

దేశంలోని ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చే యోచనలో కేంద్రం..!

దేశంలోని ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అసంఘటిత (అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్) రంగాలలో ఉన్న కార్మికులతో పాటు ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  ‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’ గా ఈ స్కీమ్ ను రూపొందుస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం అసంఘటిత రంగాలలో ఉన్న కార్మికులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి పెన్షన్ పొందేందుకు వీలు లేదు. అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలు మాత్రమే అవకాశం కల్పిస్తు్న్నాయి. అటల్ పెన్షన్ యోజన కింద 60 ఏళ్ల తర్వాత కనీస పెన్షన్ గా నెలకు వెయ్యి రూపాయలు, రూ.2 వేలు, 3 వేలు, 4 వేలు, 5 వేల రూపాయల వరకూ పెన్షన్ వస్తుంది. అది కూడా కార్మికుల కంట్రిబ్యూషన్ ఆధారంగా ఈ పెన్షన్ ఉంటుంది. 

యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఉద్దేశం:

ఉద్యోగులకు, సెల్ఫ్ ఎంప్లాయిస్ కి.. అంటే ప్రభుత్వ జీతం తీసుకునే వారి నుంచి సొంత వ్యాపారం, సొంతంగా సంపాదించే వారికి కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

EPFO స్కీమ్కు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కు తేడా ఏంటి..?

 ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (EPFO) కు, ప్రస్తుతం తీసుకురానున్న యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కు చాలా తేడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చేందుకు స్కీమ్ ఉంది. అదేవిధంగా ప్రైవేటు రంగంలో లేదా ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు  EPFO ఉంది. ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ లో ఉద్యోగులు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే అంత మొత్తంలో సదరు కంపెనీ ఆ ఎంప్లాయిస్ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. 

అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వారికి అటల్ పెన్షన్ యోజన ఉంది. అదే విధంగా రైతులకు కిసాన్ యోజన, గిగ్ వర్కర్లకు శ్రమయోగి యోజన లాంటి స్కీమ్ లు ఉన్నాయి. అయితే దేశ ప్రజలందరికీ ఒకటే తరహా స్కీమ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 

కొత్తగా తీసుకొచ్చే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్.. ఇది వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) స్థానంలో వస్తుందనే ఆందోళన అవసరం లేదని, NPS ఎప్పట్లాగే కొనసాగుతుందని సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇటీవలే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది NPSకు కొనసాగింపుగా వచ్చిన స్కీమ్.