పొద్దున లేవడంతోనే ఫోన్ చేత్తో పట్టుకుంటారు చాలామంది. వాళ్లలో సగం మంది ఫస్ట్ ఓపెన్ చేసేది వాట్సాప్. అంతగా అలవాటైపోయింది ఈ యాప్. అందులో మార్నింగ్ స్టేటస్లు, గ్రూప్ మెసేజ్‌లు చూస్తే ఎవరెవరు? ఏం చేస్తున్నారో? తెలిసిపోతుంది. వీటితోపాటు సొసైటీలో జరుగుతున్న న్యూస్ గురించి కూడా వాట్సాప్‌లో వస్తే? పేపర్ చూడ్డానికంటే ముందే న్యూస్ ఏంటో తెలిసిపోతుంది కదా! అందుకోసమే ఒక కొత్త అప్డేట్ తెచ్చింది వాట్సాప్.
అప్డేట్ని చాట్స్ లేదా గ్రూప్స్‌కి అడ్మిన్ ఫార్వర్డ్ చేసినప్పుడు అది తిరిగి ఛానెల్‌కే లింక్ అవుతుంది. దానివల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఈజీగా తెలుసుకోవచ్చన్నమాట.
వాట్సాప్ తీసుకొచ్చిన ఆ కొత్త అప్ డేట్ బ్రాడ్కాస్ట్ ఫీచర్. ఈ ఫీచర్లో మన దేశంతో సహా150 కి పైగా దేశాలకు సంబంధించిన న్యూస్ ఛానెల్స్ ఉంటాయి. వాటిలో ఎవరికి నచ్చిన గ్రూప్‌ని వాళ్లు ఫాలో కావచ్చు. ఆ ఛానెల్స్‌లో న్యూస్ అప్డేట్స్ రెగ్యులర్ చాట్స్ లాగానే యూజర్లకు వస్తుంటాయి. యూనీ డైరెక్షనల్ బ్రాడ్‌కాస్టింగ్ టూల్లా పనిచేస్తాయి ఈ ఛానెల్స్. టెక్స్ట్, ఫొటోస్, వీడియోలు, స్టిక్కర్స్, పోల్స్ వంటివాటికి పర్మిషన్ ఉంది.
- వాట్సాప్ న్యూస్ ఛానెల్స్ ఫీచర్ కోసం ‘అప్డేట్స్’ అనే ట్యాబ్ కూడా వచ్చింది. ఆ అప్డేట్స్ కావాలంటే స్టేటస్ యాక్సెస్ ఇవ్వాలి. ఇంకా ఛానెల్స్‌ని ఫాలో అవుతూ విడిగా చాట్ చేయొచ్చు.
- అంతేకాకుండా చాట్, ఇ–మెయిల్ లేదా పోస్ట్ ఆన్లైన్లో షేర్ చేసిన ఇన్విటేషన్ లింక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యూజర్స్‌కి కావాల్సిన ఛానెల్స్ వెతకడానికి డైరెక్టరీ కూడా ఉంది. అక్కడ ఏ దేశానికి సంబంధించిన వార్తలు కావాలంటే దాన్ని సెలక్ట్ చేసుకుంటే ఆ న్యూస్ ఛానెల్స్ కనిపిస్తాయి.
- దాంతోపాటు యూజర్స్ బ్రౌజ్ చేసే యాక్టివిటీ లెవల్, పాపులారిటీ, కొత్తదనం వంటి అంశాలను బట్టి న్యూస్ ఛానెల్స్ కనిపిస్తాయి. కాబట్టి వెతకడం కూడా ఈజీనే.
రియాక్షన్స్ – ఎడిటింగ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బ్రాడ్ కాస్ట్ ఛానెల్స్లాగానే వాట్సాప్ ఛానెల్స్‌కు కూడా రియాక్షన్స్ ఇవ్వొచ్చు. అదెలాగంటే... న్యూస్ ఛానెల్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే, దానికి ఎమోజీతో ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. అప్పుడు ఎన్ని రియాక్షన్స్ ఇచ్చారో కనిపిస్తుంది. కానీ, ఇండివిడ్యువల్ రియాక్షన్స్ ఫాలోవర్స్ అందరికీ కనిపించవు. ఎవరికైతే రిప్లై రియాక్షన్ వస్తుందో వాళ్లకే కనిపిస్తుంది. ఎడిటింగ్ ఆప్షన్ కూడా త్వరలోనే రానుంది. ఇది వస్తే 30 రోజుల్లో వచ్చిన అప్డేట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే 30 రోజులకు ముందు వరకు ఉన్న చాట్స్ అన్నీ వాట్సాప్ సర్వర్ నుంచి ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యేలా ఈ ఆప్షన్ కూడా వస్తోంది. ఛానెల్స్‌లో వచ్చే మెసేజ్‌లతో వాట్సాప్ నిండిపోకుండా ఉండేందుకు ఛానెల్ హిస్టరీ 30 రోజుల కంటే ముందే డిసప్పియర్ అయ్యేలా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేకాకుండా వాటితోపాటు ఛానెల్ అడ్మినిస్ట్రేటర్స్‌కి స్క్రీన్ షాట్, ఫార్వర్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎవరిని ఫాలో కావాలి లేదా డైరెక్టరీలో వాళ్ల ఛానెల్ కనిపించాలా? లేదా? అనేది కూడా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. ఎక్కువమంది ఆడియెన్స్‌ని రీచ్ అయ్యేందుకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఆప్షన్‌ను ఛానెల్స్ పెట్టుకోలేదు.