భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

‘భీమ్లానాయక్’ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో.. ఆ సినిమా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కూడా అంతే ఆసక్తిగా చూస్తున్నారు పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్ ఫ్యాన్స్. వారిని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా తరచుగా ఏదో ఒక అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ‘సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోడింగ్.. రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ కమింగ్ సూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటూ త్వరలో ఓ పాటను రిలీజ్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పాటలోని స్టిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా వదిలారు. రానా మరో హీరోగా నటిస్తున్నాడు. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లాస్ట్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ సెట్‌లో పవన్‌ని కలిసిన దర్శకుడు హరీష్ శంకర్..‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి డిస్కస్ చేశారు. చర్చలు ఇంటరెస్టింగ్‌గా సాగాయని, త్వరలోనే యాక్షన్‌లోకి దిగబోతున్నామని సోషల్ మీడియాలో రివీల్ చేశారు.