యూట్యూబ్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు కొత్త అప్ డేట్ ని తీసుకురానుంది. ఈ అప్ డేట్ లో యూట్యూబ్ ఇంటర్ ఫేస్ మొత్తం మారనుంది. ఇందులో లైక్, డిస్ లైక్, షేర్, డౌన్ లోడ్ ల ఐకాన్ లు కొత్తగా కనిపించనున్నాయి. సబ్ స్క్రైబ్ బటన్ కూడా చిన్నగా కుడి పక్కన ఉంటుంది.
డార్క్ మోడ్ ను మరింత డార్క్ గా చేస్తున్నారు. దీనివల్ల ఆల్ట్రా హెచ్ డి, ఫోర్ కే టీవీల్లో చూసే యూజర్లకు మంచి ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. వీడియో మధ్యలో పది సెకండ్లు కట్ చేసి ఉన్న వీడియో క్లిప్స్ ను సీకింగ్ చేస్తూ చూడొచ్చు. వీడియోను కావాల్సినంత జూమ్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ ఫింగర్ యూజర్స్ కి సులువుగా ఉండేలా అప్ డేట్ ని తీసుకొచ్చింది యూట్యూబ్.