Whatsapp ringtones: వాట్సాప్లో రింగ్టోన్లు మార్చుకోవచ్చు

Whatsapp ringtones: వాట్సాప్లో రింగ్టోన్లు మార్చుకోవచ్చు

ఇదివరకు వాట్సాప్ కాల్స్ కి కావాల్సిన రింగ్ టోన్ పెట్టుకునే వెసులుబాటు ఉండేదికాదు. ఫోన్ కి ఏ రింగ్ టోన్ ఉంటే వాట్సాప్ కాల్స్ కూడా అదే రింగ్ టోన్ వస్తుంది. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన అప్ డేట్ తో వాట్సాప్ రింగ్ టోన్ పెట్టుకోవడమేకాదు, ఒక్కో యూజర్ కు ఒక్కో రింగ్ టోన్ పెట్టుకునే వీలు కల్పిస్తుంది. రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలంటే..

ముందుగా వాట్సాస్ కాంటాక్ట్ (చాట్) ఓపెన్ చేయాలి. అందులో కుడి పక్కన ఉన్న ఐకాన్ సింబల్ (మూడు  చుక్కల) క్లిక్ చేసి, వ్యూ కాంటాక్ట్ ఓపెన్ చేయాలి. అప్పుడు ‘కస్టమ్ నోటిఫికేషన్’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ‘యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్’ అని కనిపిస్తుంది.  దాన్ని ఎనెబుల్ చేయాలి. తర్వాత అందులో కనిపించే నోటిఫికేషన్ టోన్, రింగ్ టోన్ ఆప్షన్స్ పై క్లిక్ చేసి కావాల్సిన రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.