ఏప్రిల్1 నుంచి ఈ ఫోన్ నెంబర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పని చేయదు:మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి

ఏప్రిల్1 నుంచి ఈ ఫోన్ నెంబర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పని చేయదు:మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి

టెలికాం ఆపరేటర్లు మాత్రమే కాదు.. గూగుల్ పే, ఫోన్ పేతోపాటు బ్యాంకులు అన్ని కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం కూడా 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నది. అంటే మరో 10 రోజుల్లోనే.. ఇదేంటో తెలుసా.. మీ ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేనట్లయితే.. అలాంటి నెంబర్ కు ఇక నుంచి మీరు గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ద్వారా డబ్బులు పంపించలేరు.. యాక్టివ్ గా లేని ఫోన్ నెంబర్ కు ఎలాంటి డబ్బులు పంపించలేరు.. అలాంటి ఫోన్ నెంబర్లకు బ్యాంకు ఖాతా నుంచే కాకుండా UPI పేమెంట్ గేట్ వే నుంచి తొలగించనున్నారు. అది కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నది. పూర్తి వివరాలు ఏంటంటే..

ALSO READ | ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!

ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ (UPI) కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తు్న్న యూపీఐ అకౌంట్ కు ఓ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు..ఆ ఫోన్ నెంబర్ ను మీరు చాలా కాలంగా ఉపయోగించకుండా ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లయితే ఇక నుంచి ఆ ఫోన్ నెంబర్ పై ఉన్నటువంటి యూపీఐ యాప్ కూడా పని చేయదు. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

దీనికి కారణం ఏంటీ..?

రోజురోజుకు సైబర్ క్రైంలు పెరుగుతున్నందున NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ నంబర్లతో యూపీఐ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో టెక్నికల్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. టెలికం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి రీలోకేట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు NPCI ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే లింక్ చేయాలని సూచించింది. 

నంబర్ యాక్టివ్ గా ఉందా లేదా.. ఎలా చెక్ చేయాలి..?

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ టెలికాం ప్రొవైడర్ (జియో, ఎయిర్‌టెల్, విఐ, లేదా బిఎస్‌ఎన్‌ఎల్ వంటివి)తో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి. లేదా కొత్త మొబైల్ నంబర్‌తో మీ బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలి.

ప్రతి వారం యాక్టివ్ గా లేని మొబైల్ నంబర్ల రికార్డులను సవరించాలని NPCI బ్యాంకులు ,UPI అప్లికేషన్లను ఆదేశించింది. తద్వారా ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులనుంచి ఏవైనా యాక్టివ్ గా లేని నంబర్లను తొలగించనున్నారు. ఏవైనా నిష్క్రియాత్మక నంబర్‌లను తొలగిస్తుందని నిర్ధారిస్తుంది.