కాంగోలో విజృంభిస్తున్న Mpox .. జనవరి నుంచి 330 మంది మృతి

మైనింగ్ టౌన్ కాంగోలో Mpox  విజృంభిస్తోంది. జనవరి నుంచి 4500 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని దాదాపు 300 మంది మరణించారని డబ్ల్యూ హెచ్ వో ప్రకటించింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువ.  చాలామంది రోగులలో ఈ వ్యాధి జననేంద్రియాలకు సోకుతున్నట్లు డాక్టర్లు చెపుతున్నారు. డెమోక్రటిక్ రిపిబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)  Mpox అరికట్టడంలో చర్యలు తీసుకుంటోంది. అయితే మైనింగ్ టౌన్ కాంగోలో కొత్త రూపం ప్రజల్లో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కాంగో ఇటీవల దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి. 

Mpox కొత్త దశ

తూర్పు కాంగోలోని కమిటుగాలో అక్టోబర్ -జనవరి మధ్య ఆసుపత్రిలో చేరిన రోగుల్లో Mpox వేరియంట్  ఒకరినుంచి మరొకరిని వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇది అడవి జంతువులతో తక్కువ సంబంధాలుంటే పట్టణంలో వ్యాప్తిం బాగా ఉంది. గతంలో ఎక్కువగా ఛాతి, చేతులు , కాళ్లపై గాయాలు కనిపించేవి.Mpox కొత్ దశలో రోగి జననేంద్రియాలపై గాయాలు అవుతున్నట్లు డాక్టర్లు చెపుతున్నారు. ఈ వ్యాధి సెక్స్ ద్వారా వ్యాపించినట్టు నిర్ధారించారు. 

కొత్త వేరియంట్ వైరస్ ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎమోరీ యూనివర్శిటీలోని అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ బోఘుమా టైటాంజీ స్పష్టం చేశారు.