వెల్ఫైర్ మోడల్లో కొత్త వెర్షన్‌ను టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండగా, ధర రూ.1,19,90,000 నుంచి స్టార్టవుతోంది. వైట్, జెట్ బ్లాక్ కలర్స్‌లో ఈ బండి అందుబాటులో ఉంది. అప్‌గ్రేడెడ్ వెర్షన్లో వెహికల్ డయాగ్నోస్టిక్స్, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్స్, ఎమెర్జెన్సీ సర్వీసెస్ వంటి 60 కనెక్టెడ్ ఫీచర్లను చేర్చారు. ఆరు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీలో గేమర్ ఎడిషన్
కామెట్ ఈవీలో స్పెషల్ ఎడిషన్ ‘ది గేమర్ ఎడిషన్’ ను ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసింది. పాపులర్ గేమర్ మోర్టల్ (నమన్ మాథుర్) ఈ కారును డిజైన్ చేశారు. ఇప్పటికే ఉన్న కారు ధరకు అదనంగా రూ.64,999 చెల్లించి ఈ స్పెషల్ ఎడిషన్‌ను కొనుక్కోవచ్చు. ఎంజీ వెబ్సైట్, డీలర్‌షిప్‌ల దగ్గర ఎంజీ కామెట్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.