మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు విస్తృత ప్రచారం చేయాలని స్టేట్చీఫ్ఎలక్షన్ఆఫీసర్ వికాస్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ– 2023’, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ టీచర్స్ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై కలెక్టర్ ఎస్. వెంకట్ రావుతో పాటు ఉమ్మడి జిల్లా ఆర్వోలు, ఏఈఆర్వోలతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఓటరు తొలగింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటరు కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి ఫామ్– -7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలన్నారు. వలస వెళ్లిన వారి పేరునుఏదైనా సర్టిఫికెట్ఆధారంగానే తొలగించాలన్నారు. కొత్త ఓటరు ఎన్రోల్కోసం ఆయా కాలేజీల్లో ఒక పాయింట్ పర్సన్ ను నియమించి 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి ఓటుహక్కు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో మెప్మా గ్రూపులు, వార్డు ఆఫీసర్లను కోఆర్డినేషన్చేస్తూ కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు నమోదుపై పోలీస్ శాఖ ద్వారా అన్ని జంక్షన్లలో అవగాహన కల్పించడంతో పాటు హోర్డింగ్స్, ఫ్లెక్సీల ఏర్పాటు, స్థానిక కేబుల్ ఛానల్స్ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
ఓటర్ జాబితా పై వచ్చిన అభ్యంతరాలపై సీఈవో సమీక్షిస్తూ.. అభ్యంతరాలను 24 గంటలకు మించి పెండింగ్ లో పెట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు ఓటరు జాబితా పై రోజూ అరగంట సమయం కేటాయించాలని సూచించారు. మహబూబ్ నగర్, -రంగారెడ్డి, -హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై సమీక్షిస్తూ ఓటరు నమోదు కోసం వచ్చిన ఫామ్స్‌ను ఎలా పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. పరిశీలనలో డెసిగ్నేటెడ్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అన్నారు. అంతకుముందు ఆయన మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్‌ను విజిట్‌చేసి ‘ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ– 2023’ , ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఆన్లైన్, ఆఫ్‌లైన్ అప్లికేషన్ల విధానాన్ని పరిశీలించారు. పెండింగ్ అప్లికేషన్లు, పరిష్కరించిన వాటి వివరాలతో పాటు వివిధ అంశాలను కలెక్టర్ తో పాటు తహసీల్దార్‌ను అడిగారు.
అనంతరం వికాస్రాజ్వెంకటాపూర్ గ్రామాన్ని విజిట్‌చేసి అక్కడ పోలింగ్ బూత్ లో ఓటరు నమోదు గురించి బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్వెంకట్రావు ఓటరు జాబితా తయారీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ద్వారా సీఈవోకు వివరించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కె.సీతారామారావు, వనపర్తి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఆర్డీవోలు, ఈఆర్వోలు పాల్గొన్నారు. అనంతరం సీఈవో తిరుగు ప్రయాణంలో కావేరమ్మపేటలోని పోలింగ్‌కేంద్రాలను తనిఖీ చేసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.