![ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో లేదో.. స్టేటస్ చెక్ చేసుకోండిలా](https://static.v6velugu.com/uploads/2025/02/new-website-for-indiramma-illu-status-in-telangana_LTkFHtS20E.jpg)
- ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ కోసం కొత్త వెబ్సైట్
- ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ మొబైల్లో !
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమును పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ తెచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ ను ఇటు లబ్ధిదారులు, అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు.
ఈ వెబ్సైట్ద్వారా ఇందిరమ్మ దరఖాస్తుదారులు/లబ్ధిదారులు.. తమ అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది? సర్వే రిపోర్ట్ఎలా వచ్చింది? ఇల్లు మంజూరైందా ? లేదా? మంజూరుకాకపోతే కారణాలేంటి? ఇకవేళ మంజూరైతే ఆ ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈమేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్అయ్యి, గ్రీవెన్స్ స్టేటస్‌లోని సెర్చ్‌లో ఆధార్ నెంబర్ / మొబైల్ నెంబర్ / రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారం పొందచ్చని తెలిపారు. దరఖాస్తు దారులకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ద్వారా తెలియజేసే అవకాశం కల్పించామన్నారు.
కాగా, గత నెల 26 న రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందచేసిన సంగతి తెలిసిందే. ఈ లబ్ధిదారులు జాగాను క్లిన్ చేసి ముగ్గులు పోసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.