న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తొలిదేశం న్యూ జీలాండ్.. మొదలైన వేడుకలు

న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తొలిదేశం న్యూ జీలాండ్.. మొదలైన వేడుకలు

కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది న్యూజీలాండ్. ప్రపంచంలోనే మొట్ట మొదటి న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ అట్టహాసంగా జరుగుతున్నాయి. న్యూజీలాండ్ ప్రజలు 2025 నూతన సంవత్సరాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆక్లాండ్ లో ప్రజలు రోడ్లపైకి వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. స్కై టవర్స్ పై నుండి ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఆక్లాండ్ ప్రజలు.

ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్ రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలు పెట్టారు న్యూజీలాండ్ ప్రజలు. ప్రపంచ వ్యాప్తంగా తొలి న్యూ ఇయర్ న్యూజీలాండ్ ప్రజలకు వస్తుంది. న్యూజీలాండ్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు కావడంతో.. త్రీ.. టూ.. వన్.. గో.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 

ప్రజలంతా ప్రధాన కూడళ్ల వద్ద గుమిగూడి కేక్ కట్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ తో దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల సందడి గ్రాండ్ గా మొదలయ్యింది.