New Year 2025 : హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలుపెట్టేశారు.. బి అలర్ట్

New Year 2025 : హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలుపెట్టేశారు.. బి అలర్ట్

న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోయారు జనం.. హైదరాబాద్ సిటీలో అయితే ఇప్పటికే జోష్ కనిపిస్తుంది. ఇదే సమయంలో పోలీసులు తమ విధుల్లోకి వచ్చేశారు. తాగి రోడ్లపై ఇష్టమొచ్చినట్లు తిరుగుతామంటే కుదరదు అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. 2024 డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం నుంచే రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. సిటీ శివార్లలోని ఇబ్రహీంపట్నం ఏరియాలో పోలీస్ టీమ్స్.. ట్రాఫిక్ కంట్రోల్ తోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలు పెట్టేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా సాయంత్రం కదా డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఉండేది అనుకుని తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు. పోలీసులు ఎక్కడిక్కడ మధ్యాహ్నం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించడం మొదలు పెట్టారు. సిటీలోకి ప్రవేశిస్తున్న వాహనదారులను ఆపి టెస్టులు నిర్వహిస్తున్నారు. 

ALSO READ | మీ బైక్ పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. పార్కింగ్ చేసిన వాహనాలే వాళ్ల టార్గెట్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగుడా లో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ టెస్టులు మొదలయ్యాయి. ఔటర్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి సిటీలోకి ఎంటర్ అవుతున్న వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా సిటీ బయటకు వెళ్లే వాహనాలను కూడా ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అనుమానం వచ్చిన వాహనాన్ని పక్కకు ఆపి.. బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్టులు చేస్తున్నారు. ఇంకా సాయంత్రం కూడా కాలేదు.. అప్పుడే టెస్టులేంటి అన్నట్లుగా కొందరు వాహనదారులు అనుకుంటున్నప్పటికీ.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. మరి కాసేపట్లో సిటీలోని అన్ని రూట్లలో ఈ తనిఖీలు ప్రారంభం అవుతాయని పోలీసులు చెబుతున్నారు.