న్యూ ఇయర్ పార్టీలకు వెళుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.. లేకపోతే జైలుకే

న్యూ ఇయర్ పార్టీలకు వెళుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.. లేకపోతే జైలుకే

న్యూ ఇయర్.. న్యూ ఇయర్.. మరికొన్ని గంటల్లో పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ వేడుకలకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమయ్యింది. హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్టులు న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబయ్యాయియి. యువత కూడా ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవన్నీ బాగానే గీత దాటితే తాట తీస్తామంటున్నారు పోలీసులు.

ఎవరు ఏం చేయాలనుకున్నా నిబంధనలు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో యువత తాగి రోడ్లపై హంగామా చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. పబ్స్, హోటల్స్‌లో డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈవెంట్ అనుమతులు, భద్రత

న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే ప్రీమియం హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు కనీసం రెండు వారాల ముందుగా పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని నగర్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ సంస్థలు అన్ని ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చాల‌ని సూచించారు.

ALSO READ | New Year Alert : 31 సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు మూసివేత

అడ్డగోలు సౌండ్‌లు వద్దు

న్యూ ఇయర్ వేడుకలు అర్ధ రాత్రి 1 గంట వరకు జరుపుకోవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్‌లను రాత్రి 10 గంటలలోపు ఆఫ్ చేయాలి. అదే ఇండోర్ సౌండ్ సిస్టమ్‌లను 45 డెసిబుల్స్‌కు మించకుండా అర్ధరాత్రి 1 గంట వరకూ పెట్టుకోవచ్చు. 

నో డ్రగ్స్

ఈసారి డ్రగ్ సంబంధిత కార్యకలాపాలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రదేశాలలో పార్కింగ్ స్థలాలు, ఏకాంత ప్రదేశాలలో నిఘా పెంచారు.

తాగినోళ్లకు మళ్లీ మళ్లీ పోయొద్దు

ఎక్సైజ్ చట్టం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న అతిథులకు మద్యం అందించకూడదని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. 

 తాగి వాహనం నడిపితే.. తాట తీస్తారు

మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు, జైలుశిక్ష, వాహనాల జప్తు వంటి కఠిన చర్యలు ఉంటాయని న్యూ ఇయర్ వేడుకల పేరుతో హంగామా చేసే వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.