తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, అర్చనలు, అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 7:15 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. కొండపైన, కింద తాగునీటి సౌకర్యం, రాకపోకలకు ఉచిత ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు.
ఏర్పాట్లు చేసిన అధికారులు
కొత్త సంవత్సర వేడుకలకు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలతో అందంగా తీర్చిదిద్దారు. స్పెషల్ లైటింగ్ అమర్చారు. కొత్తగుట్ట, పాతగుట్ట ఆలయాలను తెల్లవారుజామున 3:30 గంటలకు తెరిచి ఉంచుతారు. రాత్రివరకు నిరంతరాయంగా స్వామివారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు కల్పించారు.
రద్దీ దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సర వేడులకు భారీగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరంతరం కొనసాగేలా తగు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.