న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైద్రాబాద్ అంతా తిరగాలని ఎవరికి ఉండదు. కానీ ఆ రోజు ఉండే ట్రాఫిక్ .. మద్యం సేవించి హడావుడి చేసే వాళ్ల గోలల మధ్య తిరగాలంటే కొంచెం సంకోచిస్తారు కదా. అదేసమయంలో వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్లేందుకు అర్థరాత్రి వెహికిల్స్ దొరకక ఇబ్బంది పడేవాళ్లు.. మద్యం సేవించి బండి నడపలేక ఇబ్బంది పడేవాళ్లు.. అలాంటి వాళ్లకు గుడ్ న్యూస్.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హైద్రాబాద్ నగరంలో ఫ్రీగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU). న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి 10:00 PM నుండి 1:00 AM వరకు ఉచిత సేవ ఉంటుందని, అవసరమైన వాళ్లు తమ యూనియన్ నెంబర్ కు ఫోన్ చేయాలని యూనియన్ ప్రకటించింది.
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా తాగి డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకోసం నగర వాసులకు డ్రైవింగ్ చేయాల్సిన పనిలేకుండా ఉచిచత క్యాబ్ సదుపాయం కల్పిస్తు్న్నారు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA) మరియు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU). అందులో భాగంగా ఈ అసోసియేషన్లు కింది సేవలు అందిస్తున్నాయి.
అసోసియేషన్ అందిస్తున్న సేవలు:
డిసెంబర్31 రాత్రి 500 కార్లు, 250 బైక్ టాక్సీలుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా అందిస్తారు. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ సేవ అందుబాటులో ఉంచుతున్నామని యూనియన్ అధ్యక్షులు షేక్ సలాఉద్దీన్ తెలిపారు. న్యూఇయర్ రోజు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా స్థానిక పరిపాలన, బార్లు , రెస్టారెంట్లతో కలిసి ప్రజలకు ఆనందమైన సంబరాలు జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని అన్నారు.
“హమ్ ఆప్కే సాథ్ హై” – మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి.. అనే నినాదంతో 2017 నుండి, ఈ సంఘం రోడ్డు భద్రత కోసం నిరంతరం పని చేస్తోంది. గత ఎనిమిదేళ్లలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తూ అనేక ప్రాణాలను రక్షించగలిగామని ఈ సందర్భంగా తెలిపారు.
క్యాంపెయిన్ వివరాలు:
#DontDrinkAndDrive: మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాలకు ప్రమాదం.