న్యూ ఇయర్ పార్టీలో : మగవాళ్లు మందుకే ఓటేస్తారు. యూత్ అయితే మందు కోసం పోటీలు పడతారు. రోజూ తాగే అలవాటున్నా ఈ రోజు తాగడంలో ఉండే కిక్కే వేరు. అంతేకాదు.. ఈ రోజు అనుభవమూ వేరని చెప్తారు. నైట్ పార్టీలో డ్యాన్స్ లు వేస్తూ ఒక్కో పిగ్గును ఎత్తుతూ ఉండే వాళ్లు మంచినీళ్లు తాగరు. మందులో కలిపి సోడా, ఐసే ఈ రాత్రంతా శరీరావసరాలు తీరుస్తయ్. ఆ మత్తులో గంటలు కొద్దీ పడుకున్నప్పుడు శరీరానికి నీరు అందదు.
కానీ జీవ క్రియల వల్ల శరీరంలో ఉన్న నీరంతా పోతుంది. అప్పుడు మొదలవుతుంది సమస్య. కళ్లు తిరగడం, కడుపులో తిప్పడం. తలనొప్పితో ఏదో తెలియని సమస్య బాధపెడుతుంది. అదేమిటో అర్థం కాక తలబాదుకోకుండా అది ఆల్కహాల్ హ్యాంగోవర్ అని గుర్తించాలి.. తాగడం అలవాటు అనుకోకండి. అలా తాగడం వల్ల ఈ రోజు శరీరానికి వచ్చిన సమస్యను అనకొని కొంచెం విశ్రాంతి, మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పస్ట్ డే కాదు ఏడాదంతా సంతోషంగా సాగిపోతుంది..
హ్యాంగోవర్ లక్షణాలు
1. ఆయాసం
2. నోరు ఎండిపోతుంది.
3. విపరీతమైన దాహం
4. కాళ్ళూ, చేతుల వణుకు
5. కండరాల నొప్పి
6. సరిగా శ్వాస తీసుకోలేక పోవడం
7. కళ్లు తిరగడం
8. ఎక్కువ వెలుతురు చూడలేదు. ఎక్కువ శబ్దం వినలేదు
9. కొన్ని నిమిషాల నుంచి గంటలపాటు స్పృహ కోల్పోతారు
10. కడుపులో వికారం, తిప్పడం. వాంతులు
11. విపరీతమైన మూత్ర విసర్జన.
12. తలనొప్పి
13. అతినిద్ర
14. అకలి ఉండదు
16. గుండె వేగంగా కొట్టు కోవడం..
17. విపరీతంగా చెమట పోయడం
18. పిచ్చిగా ప్రవర్తించడం
19. గందరగోళంగా ఉండడం
బెడ్ రెస్ట్ .. బెటర్
నిద్ర నుంచి బలవంతంగా ఎవరైనా లెపిన, ఏదోఒక పని చేయాలని ఎలాగైనా లేచేందుకు ప్రయత్నించినా శరీరం, మనసు సహకరించవు.... కాబట్టి నిద్ర పట్టినా, పట్టకున్నా మంచం పైనే ఉంటే మంచిది. ఏ పని ఉన్న వాయిదా వేయడం ఉత్తమం. డ్రైవింగ్ సరిగా చేయలేదు. డీ హైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి మెదడు సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఒక్కోసారి కళ్లు తిరుగుతాయి. అందుకే, అన్ని పనులకూ దూరంగా ఉండటమే బెటర్. అవసరమనుకుంటే కుటుంబ సభ్యుల సహకారంతో పనులు చక్కదిద్దుకోవాలి
Also Read : జనవరి ఫస్ట్.. నాన్ వెజ్ పెప్పర్ స్పెషల్ వంటకాలు
అల్లంతో మెదలుపెట్టండి
అతిగా తాగితే కడుపులో తిప్పడం సాధారణమే. వాంతులు కూడా అవుతాయి. అలాంటప్పుడు ఏది తిన్నా మళ్లీ వాంతులవుతాయి. సమస్య నుంచి బయటపడాలంటే కడుపులో ఏదో ఒకటి పడాలి. ఈ సమస్యకు మందు అల్లమే. కడుపులో తిప్పుతున్నట్లుంటే అల్లంతో సమస్యను అధిగమించవచ్చు. ఉదయం అల్లం కషాయం తాగినా, అల్లంతో చేసిన టీ తాగినా కడుపులో తిప్పడం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏదయినా లైట్ ఫుడ్ తింటే వాంతులు కావు.
రీ హైడ్రేషన్
డీ హైడ్రేషన్ నుంచి బయటపడేందుకు శరీరాన్ని మళ్లీ లవణాలతో నింపాలి. ఒక టీ స్పూన్ సాల్ట్, ఎనిమిది టీ స్పూన్‌ల పంచదారని అయిదు కప్పుల డిస్టిల్స్ వాటర్ (వేడి చేసి చల్లార్చిన నీళ్లు) లో కలిపి శరీరానికి సోడియం క్లోరైడ్, గ్లూకోజ్ ని అందించే ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ నీళ్లని కొద్దికొద్దిగా రోజంతా తాగాలి. 24 గంటలపాటు ఇలా చేస్తే హైడ్రేషన్ వల్ల కలిగి కళ్లు తిరగడం, లైట్ సౌండ్ సెన్సిటివిటీల నుంచి బయటపడతారు.
లైటే రైట్
హ్యాంగోవర్ సమస్య ఉన్నప్పుడు హెవీ ఫుడ్ తీసుకుంటే మరో సమస్యని కొని, తెచ్చుకున్నట్లే. లిక్విడ్ ఫుడ్ ప్రారంభించాలి లైట్ ఫుడ్‌ని కొంచెం కొంచెం తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం. కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకుంటే శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాల పరిమాణం పెరుగుతుంది. డిసెంబరు 31 రాత్రి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని, హ్యాంగోవరతో ఉన్నప్పుడు జనవరి ఫస్టునా ఇచ్చే పార్టీలకు తప్పకుండా దూరంగా ఉండాలి. కేకులు, బేకరీ ఐటమ్స్ సాఫ్ట్ డ్రింక్స్న పూర్తిగా పక్కన పెట్టాలి. నాన్ వెజ్, హెవీ పుడ్ తీసుకోవద్దు.
ఆల్కహాల్ హ్యాంగోవర్ తో మన దేశంలో ఏటా కోటి మంది దవాఖానల పాలవుతున్నారు. హ్యాంగోవర్ లక్షణాలు తీవ్రంగా ఉంటే సమస్య కూడా తీవ్రంగా ఉన్నట్లు, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణహాని కూడా ఉండొచ్చు. హ్యాంగోవర్ సమస్య వున్న వాళ్లని దవాఖానలో చేర్చి అత్యవసర వైద్యం అందించాలి