న్యూ ఇయర్ వచ్చిందంటే కొత్త ఆశలు, కోరికలు ఉరకలు వేస్తాయి.కొందరైతే కొత్త కొత్త తీర్మానాలు చేసుకుని కొత్త సంవత్సరంలో ఏవేవో చేయాలని అనుకుంటారు. కానీ, అలా అనుకునేవాళ్లలో చాలామంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. అందుకు కారణాలు బోలెడు ఉండొచ్చు. కానీ, సులువైన మార్గాలు పాటిస్తే ఆ రెజుల్యేషన్స్ పూర్తి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..
నార్మల్ట్ పీపుల్ కి గోల్ సెట్ కాదనేది పచ్చి అబద్ధం. ఆ లక్ష్యాన్ని చిన్నగా సెట్ చేసుకోవడం ద్వారా అనుకున్నవి నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక పుస్తకం చదవాలని అనుకున్నారనుకోండి. 'ఆ పుస్తకాన్ని గంటలో మొత్తం చదివేద్దాం... అనుకోవడం కంటే అదే గంటలో ఒక లైన్ మాత్రమే చదివేద్దాం.. అనుకోండి. అప్పుడు ఎంచుకున్న గోల్ చాలా చిన్నగా, సులువుగా అనిపిస్తుంది. పనిని తేలికగా పూర్తి చేసుకోగలుగుతారు. అందుకే ఎదుటి వాళ్లు నవ్వుకున్నాసరే... గోల్స్ అనేవి స్టుపిడ్ అండ్ స్కాట్ గా ఉండాలి. ఫెయిల్ అయ్యే శాతం జీరోగా ఉండాలి. అప్పుడే కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగి అనుకున్నది సాధించుకోగలుగుతారు. డెయిలీ ఎక్సర్ సైజులు చేద్దాము సుకునే వాళ్ల విషయంలో ఈ ఐడియా బాగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎఫర్ట్
శ్రమ పడనంత వరకు మనిషికి .. మనసుకు హాయిగా ఉంటుంది. కానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఈరోజుల్లో మోషన్ మోడ్లోకి వెళ్లడమనేది తప్పనిసరిగా మారింది. అయితే ఆశ్రమను ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టకుండానే మనం అనుకున్నది సాధించుకోవచ్చు. అందుకోసం మనం చేయాలనుకున్న పనిని ....మినీ హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఉదాహరణకు రోజూ ఉదయం ఓ అరగంట యోగా చేయాలనుకుంటారు. కానీ, ఏవేవో పనులు అడ్డుతగులు తుంటాయి. అంతే ఆ యోగాను ఒకటి నుంచి. ..ఐదు నిమిషాలు చేసేలా శ్రమ పెట్టండి. దీనివల్ల పెద్ద శ్రమ ఉండదని పనిని సులువుగా చేసుకోగలుగుతారు. అయితే ఆ చిన్న అలవాటు పెద్ద అలవాటుగా మారాలంటే మాత్రం కచ్చితంగా కాస్త ఎక్కువ శ్రమ అవసరం.
క్విట్ ఇగో..
అహం (ఇగో) వల్ల ఒక్కోసారి అనుకున్న పసులు నెరవేర్చుకోలేదు. ప్రతీ ఒక్కరిలో విల్ పవర్ (ధృడ నిశ్చయం) 100 శాతం ఉంటుంది కానీ, ఇగో వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అందుకే ఏదైనా తీర్మానం చేసుకున్నప్పుడు... ఇగోను తప్పకుండా పక్కన పెట్టాలి. దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అప్పుడే ఆత్మ విశ్వాసం పెరిగి.. అనుకున్నది సాధించుకోగలుగుతారు. పైగా సెట్ చేసుకునేవి చిన్న చిన్న లక్ష్యాలే కాబట్టి బిజీ షెడ్యూల్ లో కుదరదు అనే మాటకు అస్కారం ఉండదు.
నో టార్గెట్
ఒక తీర్మానం చేసుకుంటాం. ఆ పనిని చిన్నగా మొదలుపెడతాం. కానీ అది అలవాటుగా మారణానికి ఎన్నిరోజులు పడుతుంది? ఎప్పటి వరకు అలా చేస్తూ పోవాలి? మాక్స్ వెల్ మాల్స్ థియర్ ప్రకారం ఒక పని హ్యాబిట్ గా మారడా నికి కనీసం 21 రోజులు పడుతుంది. అదే పనిని రోజూ క్రమం తప్పకుండా కాసేపు చేస్తే మాత్రం నెల నుంచి రెండు నెలలు పడుతుందట. అలాంటప్పుడు ఒక రెజల్యూషన్ కోసం ఎన్నిరోజులు కష్టపడాలన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే చేస్తున్నది చిన్న పనే కాబట్టి కంటిన్యుట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టార్గెట్ పెట్టుకోవాల్సిన పని అస్సలు అక్కర్లేదు.
ఎమోషనల్ పుష్
మినీ హ్యాబిట్స్... అనేవి ఎమోషనల్ ఫుష్ ను ఇస్తాయి. తద్వారా చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి చాక్లెట్ లు ఎక్కువగా తినడం అలవాటు .. దాంతో అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద చాక్లెట్లు పూర్తిగా మానేద్దాం అనుకుంటారు. ఒకటి రెండు, రెండు రోజులు తర్వాత షరా -మాములే. గ్యాస్ ను పూడ్చేందుకు ఒకేసారి ఎక్కువ తినడంతో, అంతకు ముందున్న సమస్య కన్నా ఎక్కువే. ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అలవాట్లను ఒక్కసారే కాకుండా మెల్లి మెల్లిగా మానేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల సెల్ఫ్ బిలీవ్ నెస్ (స్వీయ విశ్వాసం) పెరిగి అఅలవాటు దూరం చేసుకోవచ్చు.
ఇవి కామన్
న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పరిమితులు ఉండవు.. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా ఎవరైనా చేసుకుంటారు. సాధ్యా సాధ్యాలను పక్కన పెడితే వాటిల్లో కామన్ గా చేసుకునే తీర్మానాలు కొన్ని ఉంటాయి కొత్త సంవత్సరంలో తీసుకున్న తీర్మానాల్లో ..ఫిట్ నెస్...లక్ష్యం పెట్టుకోవడం ఆశ్ర్యకరం కాదు. కొత్త తీర్మానం చేయడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టడమూ అంతే ముఖ్యం. బాడీ మాస్ ఇండెక్స్ బట్టి బరువు ఎన్ని కిలోలు తగ్గాలో, ఎన్ని కేజీలు పెరగాలో లక్ష్యం నిర్దేశించుకుని.. ముందుకు సాగాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకో వాలనుకుంటే అందుకు తగ్గట్లుగా తిండి కూడా అవసరం. అందుకే 'ఈట్ బెటర్'' తీర్మానం చేసుకుంటారు కొందరు. అయితే ఏదీ పడితే అది తినడం అనుకోవడం కన్నా ఆరోగ్యవంతమైన ఆహారానికి ప్రాధాన్యం ఇప్పడం మంచిది.ఏదో ఒక మంచి నిర్ణయంతో కొత్త ఏదానికి స్వాగతం చెప్పాలని కొందరు. అనుకుంటారు. ఈ క్రమంలో తమకు పనికి దాని అలవాట్లకు ఫుల్ స్టాప్ పెడు తుంటారు. దీనినే 'క్విట్ బ్యాడ్ హ్యాబిట్స్" ఇంటారు. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే వాటిని దూరం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ALSO READ : కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
మనిషి ఒత్తిడికి గురికావడానికి, ఇతర రకాల సమస్యలకు కారణం ఆర్థిక ప్రణాళిక లోపాలే. అందుకే 'గెట్ అవుట్ ఆఫ్ డెబిట్' తీర్మానం అవసరం ఏదాదిలో సంపాదించే ఆదాయం ఎలా ఖర్చు పెట్టాలి? అన్నది ముందే బడ్జెట్ వేసుకుంటారు కొందరు. తద్వారా కాస్త అటూ ఇటూ అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏడాదంతా గడపొచ్చన్న ధీమా ఏర్పడుతుంది. అదే సమయంలో మరింత ఆదాయం పొందే మార్గాలను చేయాల్సిన... ప్రయత్నాలను గుర్తించాలి. మొత్తానికి అప్పులు లేని ప్రశాంతమైన జీవనం గడపొచ్చు.
ALSO READ : 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్
కొత్త వ్యక్తులతో పరిచయం (మీట్ సమ్ వన్)... సుదూర ప్రయాణాలు ట్రావెల్ మోర్), చెత్త విషయాలను పక్కనబెట్టి కొత్త విషయాలను నేర్చుకోవడం (లెర్న్ సమ్ థింగ్ న్యూ) ...ఉద్యోగాలు.... ఒత్తిడిలో ఉండేవాళ్లు ఎక్కువ నిద్ర(స్లీప్ మోర్) తీర్మానాలు కామన్ గా కనిపిస్తుంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. తద్వారా వ్య క్తిగతంగా కొంత ఒత్తిడి నుంచి దూరం కావడంతో పాటు కుటుంబానికి కూడా ఆనందాన్ని అందించిన వారవుతారు.
-వెలుగు, లైఫ్-