కొత్త సంవత్సరం వచ్చేసింది.. 2025 జనవరి ఫస్ట్.. కొత్త కొత్త వంటకాలతో.. కొత్త రుచులతో కొత్త ఏడాదిని ప్రారంభించాలని తహతహలాడుతున్నారా.. డోంట్ వర్రీ.. పెప్పర్ స్పెషల్ నాన్ వెజ్ వంటకాల రెసిపీలను ఇక్కడ ఇస్తున్నాం.. రెస్టారెంట్ స్టయిల్ ఫుడ్ ను.. ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఇలా తయారు చేసుకోండి.. ఇంట్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.. మరింకెందుకు ఆలస్యం... వెంటనే పెప్పర్(మిరియాలు) వెరైటీలను ట్రై చేయండి.
రొయ్యల ఫ్రై :
కావాల్సినవి :
- రొయ్యలు : ఒకటిన్నర కప్పు
- అల్లం వెలుల్లి పేస్ట్ : 3 టీ స్పూన్లు
- పచ్చిమిర్చి తరుగు : 1 టేబుల్ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు
- టొమాటో తరుగు : పావు కప్పు,
- మిరియాల పొడి : ఒకటిన్నర టీస్పూన్
- ధనియాల పొడి : 1 టీ స్పూన్
- పసుపు : చిటికెడు
- జీలకర్ర పొడి : ఒకటిన్నర టీ స్పూన్
- మిరియాలు : 1 టేబుల్ స్పూన్
- ఉప్పు : తగినంత
- కొత్తిమీర తరుగు : పావు కప్పు
తయారీ : ముందుగా రొయ్యలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆపైన స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. టొమాటో తరుగు కూడా. వేసి కలపాల్. ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడులను వేయాలి. ఉడికించిన రొయ్యలను అందులో వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత పాన్ ను దింపేయాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి రొట్టెలతో సర్వ్ చేసుకోవాలి.
ఫిష్
కావాల్సినవి :
- చేప ముక్కలు : ఒకటిన్నర కప్పు
- ధనియాల పొడి : -3 టీ స్పూన్లు
- పసుపు : చిటికెడు.
- కారం : పావు టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు : 1 టీ స్పూన్లు
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒకటిన్నర టేబుల్ స్పూన్
- గరం మసాలా : 2 టీ స్పూన్లు
- మిరియాల పొడి : 4 టీ స్పూన్లు
- ఉప్పు : తగినంత
- నూనె : సరిపడా
తయారీ : ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి, వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోవాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. మిరియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు- అన్నింటినీ ఆ చేప ముక్కలకు పట్టించాలి. ఒక పావు గంట పాటు వాటిని పక్కన పెట్టి తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే పెనంపై కొద్దికోర్జీగా నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చాలి. చివరగా నిమ్మరసం చల్లి సర్వ్ చేసుకోవాలి.
మటన్
కావాల్సినవి :
- మటన్ ముక్కలు- : 2 కప్పులు
- పసుపు : పావు టీస్పూన్
- ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
- కారం : టీస్పూన్
- మిరియాల పొడి : 2 టీ స్పూన్లు
- కొత్తమీర తరుగు : పావు కప్పు
- మిరియాలు : 1 టీ స్పూన్
- గసగసాలు : అరటీస్పూన్
- ధనియాల పొడి : అర టీ స్పూన్
- గరం మసాలా : అర టీ స్పూన్
- ఉప్పు : తగినంత
- నూనె : సరిపడా
తయారీ : ముందుగా ప్రెజర్ కుకర్ లో మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు, మూడు కప్పుల నీళ్లు పోసి పావు గంట పాటు తక్కువ మంట మీద పెట్టాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, గనగసాలు, మిరియాలు వేగించాలి. వాటిని పొడిగా చేసి పక్కన పెట్టాలి. మళ్లీ స్టవ్ పై పాస్ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అందులో అల్లం -వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో మూడు నిమిషాలు వేగించాలి. అందులో ఉడికించిన మటన్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆపైన కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపాలి. కొద్దిసేపయ్యాక మిరియాల పొడి, కొత్తిమీద తరుగు చల్లాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
చికెన్
కావాల్సినవి :
- చికెన్ ముక్కలు : 2 కప్పులు
- మిరియాలు : 1 టీ స్పూన్
- మిరియాలు : 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి: 4 టేబుల్ స్పూన్లు.
- పచ్చిమిర్చి తరుగు : అర టేబుల్ స్పూన్
- కరివేపాకు : ఒక రెమ్మ
- ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు ఉల్లిగడ్డి పేస్ట్ - పావు కప్పు
- కొత్తిమీర తరుగు : పావు కప్పుం
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూను
- వెనిగర్ : 2 టీ స్పూను
- నూనె : సరిపడా
- ఉప్పు : తగినంత
తయారీ : ముందుగా చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో వెనిగర్, ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దాన్ని గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఉల్లిగడ్డ తరుగు, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, మిగిలిన మిరియాల పొడి వేసి కలపాలి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి అయిదు నిమిషాలు వేగించాలి. ఆపైన పది నిమిషాల పాటు మూత పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలపాలి. చికెన్ ను దింపుకునే ముందు కొత్తిమీర తరుగు వేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పెప్పర్ చికెన్ రెడీ.
== వెలుగు లైఫ్
ALSO READ | Horoscope : 2025లో ఏయే రాశుల వారికి డబ్బులు, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఉన్నత స్థాయికి చేరుకుంటారు..?