బొకేలకు బదులు బ్లాంకెట్లతో న్యూ ఇయర్ విషెస్

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వెలుగు: నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసే అధికారులు, ఇతరులు ఎవరైనా సరే బొకేలకు బదులు బ్లాంకెట్లు ఇవ్వాలన్న ఆదిలాబాదు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా కలెక్టర్​రాజీవ్​గాంధీ హనుమంతు సూచనకు మంచి స్పందన వచ్చింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్లకు బ్లాంకెట్లు, దుప్పట్లు, స్వెటర్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వచ్చిన వాటిని వృద్ధులు, నిరుపేదలు, అనాథ ఆశ్రమాలకు అందించనున్నట్లు కలెక్టర్​దివ్య దేవరాజన్​ తెలిపారు. ఆసిఫాబాద్​లో కలెక్టర్​కు అందించిన బ్లాంకెట్లను పట్టణంలోని పీటీజీ గురుకుల స్కూల్​లో స్టూడెంట్ల కు అందజేశారు.