రియల్ స్పైడర్ మ్యాన్ : రన్నింగ్ రైలుపై పరిగెడుతున్న వ్యక్తి.. ఇట్స్ రియల్లీ షాక్

రైలు కదులుతుంటేనే ఎక్కలేం.. అలా అని కదులుతున్న రైలులో నుంచి దిగటం కూడా ప్రమాదకరం.. ఓ వ్యక్తి మాత్రం అందుకు డిఫరెంట్.. హాలీవుడ్ మూవీస్ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ తరహాలో.. కదులుతున్న రైలుపైన నిల్చొని కనిపించాడు.. అంతేనా.. రన్నింగ్ రైలుపై నిలబడి.. బోగీలపై పరిగెడుతున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

న్యూయార్క్ లో ఓ వ్యక్తి ట్రైన్ పై నిలబడి వీడియోగేమ్ క్యారెక్టర్ లాగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత ఓ స్టేషన్ రాగానే అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ ఓన్లీ అనే పేజీలో షేర్ అయింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి హూడీ, డెనిమ్‌ ప్యాంట్ ధరించి.. వీపుకు ఓ బ్యాగ్ వేసుకుని.. రైలు పైభాగంలో నిర్భయంగా నిలబడి కనిపించాడు. ఈ క్రమంలో అతను కాస్త తడబడినా.. ఆ తర్వాత దాన్ని కొనసాగించాడు.

ALSO READ : అదృష్టాన్ని ఎవడూ ఆపలేడు : మిగిలిపోయిన లాటరీకి కోటి బహుమతి

ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది సేపటికే వైరల్ అయింది. 1లక్షకు పైగా లైక్ లు తెచ్చుకున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. “20 సంవత్సరాల క్రితం 14వ యూనియన్ స్టేషన్ స్టాప్‌లో ఒక పిల్లవాడు ఇలా చేయడం నేను చూశాను. తెలివితక్కువ ఆటలు..." అంటూ పలువురు నెటిజన్లు ఆ వ్యక్తి తిట్టిపోస్తూ కామెంట్ చేస్తున్నారు. “కొన్ని నెలల క్రితం స్టేటెన్ ఐలాండ్‌లో ఒక యువకుడు ఇలా చేయడం వల్ల పాపం చనిపోయాడు. ప్రతీ క్షణం జీవితంలో చాలా విలువైనది" అని ఇంకొందరు అంటున్నారు.