న్యూయార్క్​ లో ఘనంగా శివరాత్రి సంబరాలు...  హర హర మహాదేవ పాటకు స్టెప్పులేసిన భక్తులు

న్యూయార్క్ లో శివరాత్రి సంబరాలు మొదలయ్యాయి.  హర హర మహాదేవ అంటూ నృత్యం చేశారు.  భారతదేశంలోని ఆదియోగిలో మహాశివరాత్రి మాయాజాలాన్ని చూడటానికి న్యూయార్క్ వాసులు ఉత్సాహంగా ఉన్నారు. శివరాత్రి ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తోందని సద్గురు పోస్ట్ పంచుకున్నారు.ఈ వీడియోను సద్గురు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

మహాశివరాత్రి ...  హిందువులకు ముఖ్యంగా శైవ భక్తులకు ఇది ముఖ్యమైన పండుగ. అందరూ తప్పకుండా శివాలయాలను దర్శించుకుంటారు. ఆ ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. వెలిగే దీపాల్లో తాము తెచ్చిన నూనె పోసి దేవుడిని దర్శించుకుంటారు. ఉపవాసం ఉండి.. . రాత్రంతా జాగారం చేస్తుంటారు. ఈ జాగారాన్ని ఆసరాగా చేసుకునే పాత సినిమాలు థియేటర్‌లలో ఎక్స్‌ట్రా షోలుగా రీరిలీజ్ చేస్తుంటారు. ఇదంతా మన దేశానికే పరిమితం అని ఇప్పుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. మహా శివరాత్రి వేడుకలు అగ్రరాజ్యం అమెరికాను కూడా తాకాయి.

అమెరికాలో ప్రముఖ నగరం న్యూయార్క్‌లో టైమ్స్‌స్క్వేర్ ప్రసిద్ధి చెందింది.  ఈ టైమ్స్‌స్క్వేర్‌లో  స్థానికులు మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  టైమ్స్ స్క్వేర్‌లోని నలువైపులా ఉన్న స్క్రీన్‌లలో మహా శివుడి దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలు, సంగీతంతో స్థానికులు గొంతు కలిపారు. పాదం కదిపారు.

టైమ్స్ స్క్వేర్‌లో స్థానికులు.. అంటే భారత ప్రవాసులతోపాటు అమెరికా వాసులు కూడా శివుడి సంగీతానికి స్టెప్పులు వేశారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ మహాశివరాత్రిని ఘనంగా స్వాగతించింది. శివరాత్రి ప్రాముఖ్యతను ప్రపంచం తెలుసుకుంటున్నది. మానవ సామర్థ్యాలను, మార్పునకు అవకాశాన్ని వేడుక చేసుకుంటున్నదు’ అని సద్గురు ఈ చిత్రాలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

ALSO READ ;-పునఃసమీక్షించుకోండి! గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు

మహదేవ్ మంత్రోచ్ఛారణలతో దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.   న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కూడా హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగింది.  న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లోని అత్యంత రద్దీగా ఉండే వీధి హర హర మహాదేవ్​ మంత్రం మారుమ్రోగింది.  పవిత్ర శివరాత్రి  వేళ శివ శంభు జపంతో అసాధారణ దృశ్యం కనిపించింది. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన మహాశివరాత్రి కార్యక్రమాల్లో ఒకటైన సద్గురుతో మహాశివరాత్రి వీడియో స్క్వేర్ లోని పెద్ద తెరపై ప్లే అవుతున్న సమయంలో ఎక్కడ చూసినా చప్పట్లే వినిపించాయి.