అమెరికా అంటే స్పోర్ట్స్ లో.. క్రీడల్లో బాస్కెట్ బాల్, స్నూకర్, టెన్నిస్, వాలీబాల్ వంటి గేమ్స్ గుర్తుకొస్తాయి.. ఇప్పుడు క్రికెట్ కూడా అందులో చేరబోతున్నది. అమెరికాలో క్రికెట్ కు ఆదరణ తీసుకొచ్చేందుకు.. ఇప్పటికే చిన్న చిన్న కౌంటీల్లో క్రికెట్ ఆట నిర్వహిస్తున్నారు. ఇది సరిపోదని భావిస్తున్న అమెరికా ప్రభుత్వంతోపాటు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ.. సంచలన నిర్ణయం తీసుకోనుంది. అమెరికాలోన కీలకమైన న్యూయార్క్ సిటీ వేదికగా.. ఇండియా .. పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాలని.. అది కూడా వరల్డ్ కప్ స్థాయి గేమ్ అయ్యి ఉండాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే సంచలన షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచ కప్ 2024 వేదికలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. ఈ మెగా టోర్నీ ఆమెరికాలో జరుగుతుందని ప్రకటించింది. ఆమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాలు అతిథ్యం ఇస్తాయని ఐసీసీ తెలిపింది. న్యూయార్క్ నగరానికి తూర్పున 30 మైళ్ల దూరంలో 34,000-సీట్ల కెపాసిటీతో ఉన్న స్టేడియంలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ 2024ను వెస్టిండీస్, ఆమెరికా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఇక ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో ఇండియా,పాకిస్థాన్ జట్లు 2023 అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన అసియా కప్ 2023లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి, మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ లో 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఇండియా చిత్తు చేసింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసి 10 వికెట్ల తేడాతో అసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది.