ఇండియా vs పాకిస్తాన్.. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అందరి కళ్లు దానిమీదే నిలుస్తాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు ఓడినా.. ఆ దేశ అభిమానులకు నిరాశే. గెలిచిన దేశంలో బాణసంచా వెలుగులు మిరిమిట్లు గొలుపుతుంటే.. ఓడిన దేశంలో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అలాంటి సన్నివేశాలు మనముందు కనిపించడానికి గంటల సమయం మాత్రమే మిగిలివుంది.
2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (జూన్ 9) భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. అయితే ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. న్యూయార్క్ లో రేపు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు (భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. తాజా వాతావరణ సమాచార ప్రకారం టాస్ సమయంలో వర్షం పడే అవకాశం 40% నుండి 50% వరకు ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంటలకు (భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30) మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి వర్షం పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ మైదానంలో ఐర్లాండ్ తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. భారత్ ధాటికి ఐర్లాండ్ ఈ మ్యాచ్ లో 96 పరుగులకే ఆలౌటై.. 7 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఘోర ఓటమిని మూట కట్టుకుంది. మరోవైపు పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంటే పాకిస్థాన్ ఒత్తిడిలో కనిపిస్తుంది.
Rain may interrupt the game between India and Pakistan 🌦️
— CricTracker (@Cricketracker) June 8, 2024
There is a 41% chance of precipitation in New York on June 9th. pic.twitter.com/D2n3ONl2b8