అయోధ్యలో జనవరి 22న జరిగే శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇప్పటికే దేశంలోని బూత్ స్థాయిల్లో లైవ్ స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు.
అంతేకాకుండా పలు దేశాల్లో ఉన్న ఇండియా ఎంబసీలు, కాన్సులేట్స్ ఓవర్సీస్‌లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, 2020 ఆగస్టు 5న అయోధ్యలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమాన్ని కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. -