Champions Trophy 2025: ఐదుగురు పేసర్లతో కివీస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టు ప్రకటన

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదివారం (ఫిబ్రవరి 12)  ప్రకటించింది. జట్టులో సీనియర్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్ ఈ మెగా టోర్నీకి సెలక్ట్ చేశారు. ఇటీవలే శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ కు ఈ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం విలియంసన్, కాన్వే సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఆడుతుండగా.. ఫెర్గుసన్ బిగ్ బాష్ లీగ్ తో బిజీగా ఉన్నాడు. 15 మందితో కూడిన స్క్వాడ్ కు స్పిన్నర్ సాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

సాంట్నర్, మాజీ కెప్టెన్ విలియమ్సన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ మాత్రమే చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు. ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌తో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తలపడుతుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇదే గ్రూప్ లో భారత్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ నే నమ్ముకుంది. ఆసియాలో జరగనున్న ఈ టోర్నీలో ఏకంగా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది.

Also Read : సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అమ్మాయిల గురి..నేడు ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో వన్డే

నాథన్ స్మిత్ , మాట్ హెన్రీయర్స్, లాక్ హెన్రీయర్స్, లాక్ ఓ రూర్కే లాంటి పేస్ దళంతో బరిలోకి దిగుతుంది. వీరికి ఆల్ రౌండర్లు కెప్టెన్ సాంట్నర్ తో పాటు మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర బంతితో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ కమిట్‌మెంట్‌ల కారణంగా లాకీ ఫెర్గూసన్ అందుబాటులో లేకుంటే జాకబ్ డఫీకి జట్టులో స్థానం దక్కవచ్చు. 

న్యూజిలాండ్ జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియంసన్, విల్ యంగ్

న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:

19 ఫిబ్రవరి - పాకిస్థాన్ vs న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి

మార్చి 2 - భారత్ vs న్యూజిలాండ్, దుబాయ్