
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్.. రెస్ట్ లేకుండానే స్వదేశంలో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ తో జరగబోయే ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం మంగళవారం (మార్చి 11) న్యూజిలాండ్ క్రికెట్ తమ స్క్వాడ్ ను ప్రకటించింది. మార్చి 16 నుంచి మార్చి 26 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఐపీఎల్ కమిట్మెంట్ ల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
భారత్ పై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్ లో 10 ఓవర్లలో కేవలం 10 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి కోహ్లీ వికెట్ పడగొట్టాడు. "దేశానికి కెప్టెన్ గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గత సంవత్సరం పాకిస్తాన్‌లో జట్టుకు నాయకత్వం వహించడం నాకు నిజంగా ఆనందాన్నిచ్చింది. ఈ సిరీస్‌కు కూడా ఆ జట్టు నుండి చాలా మంది ఆటగాళ్లను చేర్చుకున్నాము. ప్రస్తుత జట్టు చాలా బాగుంది". అని బ్రేస్ వెల్ అన్నాడు.
ALSO READ | Team India: స్వదేశానికి భారత క్రికెటర్లు.. ఇంటికి వెళ్లకుండా చెన్నై జట్టులో చేరిన ఆల్ రౌండర్
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన కివీస్ పేస్ బౌలర్లపై పనిభారాన్ని తగ్గిస్తూ కైల్ జామిసన్, విల్ ఓ'రూర్క్‌లను సిరీస్‌లోని మొదటి మూడు టీ20 లకు మాత్రమే సెలక్ట్ చేశారు. న్యూజిలాండ్ రన్నరప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన ఏడుగురు న్యూజిలాండ్ క్రికెటర్లు ఈ సిరీస్ కు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసినఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ చివరి రెండు టీ20 మ్యాచ్ లకు మాత్రమే హెన్రీ అందుబాటులో ఉండనున్నాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్, టిమ్ సీఫెర్ట్ లకు అవకాశమిచ్చారు.
న్యూజిలాండ్ జట్టు:
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (మ్యాచ్‌లు 4-5), మిచ్ హే, మాట్ హెన్రీ (మ్యాచ్‌లు 4-5), కైల్ జామిసన్ (మ్యాచ్‌లు 1-3), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (మ్యాచ్‌లు 1-3), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
పాకిస్తాన్ టీ20 జట్టు:
అఘా సల్మాన్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అలీ, మహ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షాహీం సుఫ్ ఖాన్