- జద్రాన్ పోరాటం వృథా
అబుదాబి: ష్చ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఫ్యాన్స్ ఆశలు నెరవేరలేదు. అఫ్గానిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. ఎంచక్కా టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుందని ఆశించిన సగటు అభిమానికి నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన అఫ్గాన్.. బౌలింగ్‌లో తేలిపోవడంతో ఆదివారం జరిగిన సూపర్–12, గ్రూప్–2 లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 8 పాయింట్లతో గ్రూప్‌లో రెండో ప్లేస్‌తో నాకౌట్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న ఇండియా.. సోమవారం జరిగే లాస్ట్ మ్యాచ్‌లో నమీబియాపై భారీ విజయం సాధించినా ప్రయోజనం లేదు. మొత్తానికి ఫేవరెట్ హోదాలో మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన కోహ్లీసేన.. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 124/8 స్కోరు చేసింది. నజీబుల్లా జద్రాన్ (48 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73) టాప్ స్కోరర్. తర్వాత కివీస్ 18.1 ఓవర్లలో 125/2 స్కోరు చేసి నెగ్గింది. విలియమ్సన్ (42 బాల్స్‌లో 3 ఫోర్లతో 40 నాటౌట్), డేవన్ కాన్వే (32 బాల్స్‌లో 4 ఫోర్లతో 36 నాటౌట్) నిలకడగా ఆడారు. ఓపెనర్లలో డారెల్ మిచెల్ (17), గప్టిల్ (28) ఓ మాదిరిగా ఆడారు. స్టార్టింగ్‌లో అఫ్గాన్ బౌలర్లు చెలరేగడంతో 57 రన్స్‌కే ఈ ఇద్దరు పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ టార్గెట్ కాకపోవడంతో నిలకడగా ఆడుతూ క్రమంగా రన్స్ రాబట్టారు. కాన్వే కూడా సమయోచితంగా స్పందించాడు. ఈ ఇద్దరు థర్డ్ వికెట్‌కు 68 రన్స్ జోడించి మరో 11 బాల్స్ మిగిలి ఉండగానే గెలిపించారు. బౌల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
జద్రాన్.. ధనాధన్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ను కివీస్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. సౌథీ(2/24), బౌల్ట్ (3/17), మిల్నే (1/17) లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో హజ్రతుల్లా (2), షెజాద్ (4), గుర్బాజ్ (6) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. 19/3 స్కోరుతో కష్టాల్లో పడిన అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను నజీబుల్లా గట్టెక్కించాడు. ఓ ఎండ్‌లో వరుస విరామాల్లో టీమ్మేట్స్ ఔటైనా.. తాను మాత్రం ఒంటరిగా పోరాడాడు. గుల్బాదిన్ నబీ (15)తో కలిసి నాలుగో వికెట్‌కు 37, మహ్మద్ నబీ (14)తో ఐదో వికెట్‌కు 59 రన్స్ జోడించడంతో ఇన్నింగ్స్ తేరుకుంది. ఫలితంగా అఫ్గాన్ 16.5 ఓవర్లలో 100 రన్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జద్రాన్ 33 బాల్స్‌లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అప్పటికే ఓవర్స్ తరిగిపోవడం, లోయర్ ఆర్డర్‌లో జనత్ 2), రషీద్ (3) ఫెయిలవడంతో అఫ్గాన్ చిన్న స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 124/8 ( జద్రాన్ 73, ట్రెంట్ బౌల్ట్ 3/17).
న్యూజిలాండ్: 18.1 ఓవర్లలో125/2 (విలియమ్సన్ 40 నాటౌట్, కాన్వే 36 నాటౌట్, రషీద్ ఖాన్ 1/27).
రషీద్ @ 400
టీ20ల్లో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీసిన వికెట్ల సంఖ్య. దీంతో అతి తక్కువ మ్యాచ్‌ల్లో (289) ఈ ఘనత సాధించిన బౌలర్‌గా నిలిచాడు. డ్వేన్ బ్రావో (364 మ్యాచ్‌లు), తాహిర్ (320 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (362 మ్యాచ్‌లు) తర్వాతి ప్లేస్‌ల్లో ఉన్నారు.
సెమీస్‌లో ఎవరితో ఎవరు
10న ఇంగ్లండ్ X న్యూజిలాండ్
11న పాకిస్తాన్ X ఆస్ట్రేలియా