హామిల్టన్ : బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర (79), మార్క్ చాప్మన్ (62) చెలరేగడంతో.. బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరోటి మిగిలి ఉండగానే కివీస్ 2–0తో కైవసం చేసుకుంది. వర్షం వల్ల 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ 255/9 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), మిచెల్ శాంట్నర్ (20) ఫర్వాలేదనిపించారు.
మహేశ్ తీక్షణ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీశాడు. తర్వాత లంక 30.2 ఓవర్లలో 142 రన్స్కే ఆలౌటైంది. కమిందు మెండిస్ (64) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్లో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒరూర్క్ 3, డఫీ 2 వికెట్లు పడగొట్టారు. రచిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో వన్డే శనివారం జరుగుతుంది.