మౌంట్‌మాగనుయ్ : ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన న్యూజిలాండ్.. రెండో టీ20లోనూ శ్రీలంకను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో మార్క్ చాప్‌మన్ (42), టిమ్ రాబిన్సన్ (41), మిచెల్ హే (41 నాటౌట్)కి తోడు బౌలింగ్‌లో జాకబ్ డఫీ (4/15) చెలరేగడంతో.. సోమవారం జరిగిన ఈ పోరులో కివీస్ 45 రన్స్ తేడాతో లంకపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (23) ఫర్వాలేదనిపించినా, రచిన్ రవీంద్ర (1), బ్రాస్‌వెల్ (1 నాటౌట్) ఫెయిలయ్యారు.
వానిందు హసరంగ 2 వికెట్లు తీశాడు. తర్వాత లంక 19.1 ఓవర్లలో 141 రన్స్‌కే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (48) టాప్ స్కోరర్. పాథుమ్ నిశాంక (37), చరిత్ అసలంక (20) పోరాడి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హెన్రీ, శాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ హేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 గురువారం నెల్సన్‌లో జరుగుతుంది.