తరౌబా : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8 కు రేసు నుంచి వైదొలిగిన న్యూజిలాండ్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. చిన్న ప్రత్యర్థి ఉగాండాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. గ్రూప్–సిలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడిన ఉగాండా 18.4 ఓవర్లలో 40 రన్స్‌కే ఆలౌటైంది. కెన్నెత్ వైస్వా (11) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ (3/4), బౌల్ట్ (2/7), శాంట్నర్ (2/8), రవీంద్ర (2/9) ఉగాండాను దెబ్బతీశారు.
ఇన్నింగ్స్ మొత్తంలో నలుగురు డకౌట్ కాగా, ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత కివీస్ 5.2 ఓవర్లలో 41/1 స్కోరు చేసింది. కాన్వే (22 నాటౌట్) రాణించాడు. ఛేజింగ్‌లో మిగిలున్న బాల్స్ (88) పరంగా టీ20ల్లో న్యూజిలాండ్‌కు ఇదే అది పెద్ద విజయం కావడం విశేషం. . సౌథీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.