ఇంగ్లండ్‌‌తో మూడో టెస్టులో...న్యూజిలాండ్‌‌ 315/9

ఇంగ్లండ్‌‌తో మూడో టెస్టులో...న్యూజిలాండ్‌‌ 315/9

హామిల్టన్ (న్యూజిలాండ్‌‌) : ఇంగ్లండ్‌‌తో మూడో టెస్టును న్యూజిలాండ్ మెరుగ్గా ఆరంభించింది. శనివారం మొదలైన మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి  బ్యాటింగ్‌‌కు వచ్చిన కివీస్‌‌ 315/9 స్కోరుతో తొలి రోజును ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు టామ్ లాథమ్ (63), విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్‌‌ (44) సత్తా చాటారు. మధ్యలో రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (14), టామ్ బ్లండెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) నిరాశపరిచినా..

మిచెల్ శాంట్నర్ (50 బ్యాటింగ్‌‌) ఫిఫ్టీతో స్కోరు 300 దాటించాడు. ప్రస్తుతం శాంట్నర్‌‌‌‌తో పాటు ఆఖరి బ్యాటర్‌‌‌‌ ఒరూర్క్ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్‌‌, గస్‌‌ అట్కిన్సన్‌‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్‌‌ రెండు వికెట్లు తీశాడు.