ODI World Cup 2023: దలైలామాతో న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫ్యామిలీలతో వెళ్లి దర్శనం

ODI World Cup 2023: దలైలామాతో న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫ్యామిలీలతో వెళ్లి దర్శనం

వరల్డ్ కప్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న న్యూజిలాండ్ కు టీమిండియా బ్రేకులు వేసింది. ఈ మ్యాచ్ లో భారత్ కు గట్టి పోటీనిచ్చినా కివీస్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఈ మెగా టోర్నీలో తొలి ఓటమిని రుచి చూసింది. అయితే ఈ ఓటమి బాధను మర్చిపోవడానికి కివీస్ ఆటగాళ్లు ఆధ్యాత్మక గురువు దలైలామాను దర్శించుకున్నారు. 

మంగళవారం(అక్టోబర్ 24) మెక్‌లియోడ్ గంజ్‌లోని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కివీస్ క్రికెటర్లు ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్లు తమ ఫ్యామిలీతో దలైలామాను కలిసి దర్శనం చేసుకోవడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో శనివారం కివీస్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ జరగడానికి మరో నాలుగు రోజులు ఉండడంతో ఇలా  దలైలామాను సందర్శించి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also Read:-రన్నింగ్, జంపింగ్ ఏది బెటర్
 
ఈ విషయాన్ని  దలైలామా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో న్యూజీలాండ్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచుల్లో గెలిస్తే వరల్డ్ కప్ సెమీఫైనల్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తమ ఆస్ట్రేలియాతో ఆడబోయే తమ తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్ కు కీలకంగా మారనుంది. మరి భారత్ పై ఓడిన కివీస్ ఆసీస్ పై మ్యాచ్ లో పూనుకుంటుందో లేదో చూడాలి.