
నేపియర్: బ్యాటింగ్‌లో రాణించిన న్యూజిలాండ్.. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బోణీ చేసింది. మార్క్ చాప్‌మన్ (132), డారిల్ మిచెల్ (76), మహ్మద్ అబ్బాస్ (52) చెలరేగడంతో.. శనివారం జరిగిన తొలి వన్డేలో 73 రన్స్ తేడాతో పాక్‌ను ఓడించింది. దీంతో సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన కివీస్ 50 ఓవర్లలో 344/9 స్కోరు చేసింది. 50 రన్స్‌కే విల్ యంగ్ (1), నిక్ కెల్లీ (15), హెన్రీ నికోల్స్ (11) ఔటయ్యారు. ఈ దశలో చాప్‌మన్, మిచెల్‌తో నాలుగో వికెట్‌కు 199, అబ్బాస్‌తో ఐదో వికెట్‌కు 31 రన్స్ జత చేశాడు.
ఈ క్రమంలో 24 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన అబ్బాస్ వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. క్రునాల్ పాండ్యా (26 బాల్స్) రికార్డును అధిగమించాడు. తర్వాత పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 271 రన్స్‌కే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (78) టాప్ స్కోరర్. సల్మాన్ ఆగా (58), ఉస్మాన్ ఖాన్ (39), అబ్దుల్లా షఫీక్ (36) రాణించినా ప్రయోజనం దక్కలేదు. చాప్‌మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.