కివీస్​ బోణీ..60 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై విజయం

కివీస్​ బోణీ..60 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై విజయం
  •     టామ్‌‌‌‌ లాథమ్‌‌‌‌, విల్‌‌‌‌ యంగ్‌‌‌‌ సెంచరీలు

కరాచీ : ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగిన న్యూజిలాండ్‌‌‌‌.. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో బోణీ చేసింది.టామ్‌‌‌‌ లాథమ్‌‌‌‌ (118 నాటౌట్‌‌‌‌),  విల్‌‌‌‌ యంగ్‌‌‌‌ (107)  సెంచరీలతో  రాణించడంతో.. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో కివీస్‌‌‌‌ 60 రన్స్‌‌‌‌ తేడాతో ఆతిథ్య పాకిస్తాన్‌‌‌‌కు షాకిచ్చింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌ 50 ఓవర్లలో 320/5 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌‌‌లో పాక్‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో టాపార్డర్‌‌‌‌లో డెవాన్‌‌‌‌ కాన్వే (10), కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ (1), డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (10) నిరాశపర్చారు. 

దీంతో  కివీస్‌‌‌‌ 73 రన్స్‌‌‌‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్‌‌‌‌, లాథమ్‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడారు. నాలుగో వికెట్‌‌‌‌కు 118 రన్స్‌‌‌‌ జత చేసిన తర్వాత యంగ్‌‌‌‌ ఔటైనా.. లాథమ్‌‌‌‌ చివరి వరకు క్రీజులో ఉండి భారీ స్కోరు అందించాడు. చివర్లో గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (61) ఫోర్లు, సిక్స్‌‌‌‌లతో భారీ హిట్టింగ్‌‌‌‌ చేశాడు. లాథమ్‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌కు 125 రన్స్‌‌‌‌ జోడించాడు. తర్వాత ఛేజింగ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 47.2 ఓవర్లలో 260 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది. బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (64), కుష్దిల్‌  షా (69) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. 

ఇన్నింగ్స్‌‌‌‌ నాలుగో ఓవర్లోనే సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ (8)ని ఔట్‌‌‌‌ చేసి విల్‌‌‌‌ ఒ రూర్క్ (3/47)తో పాటు మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌ (3/66) ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు కూడా కొనసాగించారు. సల్మాన్‌‌‌‌ ఆఘా (42)తో మూడో వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ జోడించిన బాబర్‌‌‌‌.. ఫకర్‌‌‌‌ జమాన్‌‌‌‌ (24)తో ఐదో వికెట్‌‌‌‌కు 58 రన్స్‌‌‌‌ సమకూర్చాడు. షాహీన్‌‌‌‌ ఆఫ్రిది (14)తో ఏదో వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ జోడించి కుష్దిల్‌  ఆశలు రేకెత్తించినా మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (3), నసీమ్‌‌‌‌ షా (13), రవూఫ్‌‌‌‌ (19),  తయ్యబ్‌‌‌‌ తాహిర్‌‌‌‌ (1) నిరాశపరచడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. లాథమ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌ ‌‌‌: 50 ఓవర్లలో 320/5 (యంగ్‌‌‌‌ 107, లాథమ్‌‌‌‌ 118*, నసీమ్‌‌‌‌ షా 2/63),
పాకిస్తాన్‌ ‌‌‌: 47.2 ఓవర్లలో 260 ఆలౌట్‌‌‌‌ (బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ 64, కుష్దిల్‌ షా 69, ఒ రూర్క్ 3/47, శాంట్నర్‌‌‌‌ 3/66).