వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ తో శ్రీలంక తలపడనుంది. సెమీస్ కు చేరాలంటే కివీస్ ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మరోవైపు లంక ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపును సీరియస్ గా తీసుకున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోతే కివీస్ సెమీస్ రేస్ లోనే ఉంటుంది. గెలిస్తే మాత్రం దాదాపుగా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్
#NZvsSL | #CWC23
— News18 CricketNext (@cricketnext) November 9, 2023
New Zealand Win Toss, Opt to Bowl First Against Sri Lanka in Bengaluru
Live: https://t.co/sPuDFmDVyn