
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర సమరం ప్రారంభమయింది. గ్రూప్ ఏ లో భాగంగా న్యూజిలాండ్ తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఓపెనర్ సౌమ్య సర్కార్ స్థానంలో మహ్మదుల్లా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ తంజిద్ షకీబ్ స్థానంలో నహిద్ రాణా తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్ విషయానికి వస్తే డారిల్ మిచెల్ స్థానంలో రచీన్ రవీంద్ర.. నాథన్ స్మిత్ స్థానంలో జేమిసన్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ కు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో కివీస్ పై బంగ్లా ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్ సైతం ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. కివీస్ గెలుపుతో భారత్ కూడా సెమీస్ కు చేరుతుంది. పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఆడిన ఒక్క మ్యాచ్ లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ భారత్ పై ఓడిపోయింది.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రహ్మాన్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్క్
New Zealand have won the toss and have opted to field against Bangladesh!#NZvBAN #ChampionsTrophy pic.twitter.com/tXvyUi2buf
— CRICKETNMORE (@cricketnmore) February 24, 2025