ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ గొప్పగా ఆరంభించింది. కివీస్ పై పై చేయి సాధించి తొలి సెషన్ లో మూడు వికెట్లు పడగొట్టింది. మొదటి రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో విల్ యంగ్(38) డారిల్ మిచెల్ (11) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్ కు రెండు వికెట్లు దక్కాయి. ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు మంచి ఆరంభం దక్కలేదు. ఈ సిరీస్ లో ఫామ్ లో ఉన్న కాన్వే నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆకాష్ దీప్ అతన్ని ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. దీంతో 15 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన యంగ్ తో కెప్టెన్ లాతమ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో వికెట్ కు 44 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు.
Also Read :- బుమ్రా లేకుండా భారత్ బరిలోకి.. అసలు కారణం ఇదే
ఈ సమయంలో సుందర్ తన మ్యాజిక్ చూపించాడు. రెండో టెస్టులో 11 వికెట్లు తీసుకొని సత్తా చాటిన ఈ యువ స్పిన్నర్ మూడో టెస్టులో కూడా అదరగొట్టాడు. 28 పరుగులు చేసిన లాతమ్ (28) తో పాటు ఆ వెంటనే రచీన్ రవీంద్ర (5) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్, యంగ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సాంట్నర్ ప్లేస్ లో ఇష్ సోధీకి అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్ సౌథీ స్థానంలో హెన్రీ వచ్చాడు. మరోవైపు భారత్ బుమ్రా స్థానంలో సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకుంది.
It's been an entertaining first session in Mumbai 🍿
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
🔗 https://t.co/bnmexdFFSD | #INDvNZ pic.twitter.com/3NRI1LTQVz