IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్

IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పవర్ ప్లే లో దూకుడు చూపించిన న్యూజిలాండ్ ఆ తర్వాత తడబడుతుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్ లో డారిల్ మిచెల్ (9), టామ్ లేతమ్ (2) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది. 

18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు:

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్లు విల్ యంగ్, రచీన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. ఈ దశలో కివీస్ స్కోర్ 300 ఈజీగా కొడుతుందని భావించారు. అయితే స్పిన్నర్లు ఎంట్రీ ఇవ్వడంతో న్యూజి లాండ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. వరుణ్ చక్రవర్తి విల్ యంగ్ (15) ను బౌల్డ్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్ ఒక అద్భుత బంతితో  ఊపు మీదున్న రచీన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇదే ఊపులో స్టార్ బ్యాటర్ విలియంసన్ (11) వికెట్ తీసి కివీస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు.

ALSO READ | IND vs NZ Final: ఇంకెన్ని వదిలేస్తావ్ షమీ.. చేతుల్లోకి వచ్చిన క్యాచ్ మిస్