
క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ గెలుపు దిశగా సాగుతోంది. కివీస్ ఇచ్చిన 279 రన్స్ టార్గెట్‌ను ఛేజింగ్‌లో ఆదివారం మూడో రోజు చివరకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 77/4 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (17 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ గెలవాలంటే ఇంకా 202 రన్స్ చేయాల్సి ఉంది. అంతకుముందు 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 108.2 ఓవర్లలో 372 రన్స్‌కు ఆలౌటైంది. లాథమ్ (73), రవీంద్ర (82), మిచెల్ (58) రాణించారు.