IND Vs NZ, 1st Test: పోరాటం సరిపోలేదు: ఓటమి దిశగా భారత్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం

IND Vs NZ, 1st Test: పోరాటం సరిపోలేదు: ఓటమి దిశగా భారత్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్ ఉంచింది. 3 వికెట్లకు 231 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ ఈ టెస్టులో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మరో వైపు భారత్ ఈ  గెలవాలంటే మాత్రం అద్భుతం జరగాల్సిందే. 

3 వికెట్లకు 408 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ 54 పరుగులకే చివరి 7 వికెట్లను కోల్పోయింది. విలియం ఒరోర్కే, హెన్రీ, సౌథీ చెలరేగడంతో భారత్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. 150 పరుగుల మార్క్ అందుకున్న సర్ఫరాజ్ ను సౌథీ పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత విలియం ఒరోర్కే చెలరేగడంతో పంత్ (99), రాహుల్(12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో 3 వికెట్లను 408 పరుగులతో ఉన్న భారత్ ఒక్కసారిగా 6 వికెట్లకు 438 పరుగుల వద్ద నిలిచి కష్టాల్లో పడింది. టీ విరామం తర్వాత జడేజా (5), అశ్విన్(15), బుమ్రా(0), సిరాజ్(0) వెంటనే ఔటయ్యారు.

ALSO READ : IND Vs NZ, 1st Test: పంత్ సెంచరీ మిస్.. బెంగళూరు టెస్టులో పుంజుకున్న న్యూజిలాండ్
     
సర్ఫరాజ్ 150 పరుగులు చేస్తే.. పంత్ 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్ కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆశలు రేపినా వీరి పోరాటం సరిపోలేదు. కివీస్ బౌలర్లలో  విలియం ఒరోర్కే,హెన్రీ 3 వికెట్లు పడగొట్టారు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా.. ఫిలిప్స్, సౌదీలకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఏకంగా 356 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.