భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. పూణే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేసింది. ఫాస్ట్ బౌలర్ సిరాజ్ స్థానంలో ఆకాష్ దీప్ చోటు దక్కించుకున్నాడు. రాహుల్ స్థానంలో గిల్ జట్టులో చేరాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫాస్ట్ బౌలర్ హెన్రీ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నట్ చోటు దక్కించుకున్నాడు.
భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా
Also Read :- నేటి నుంచి కివీస్‌తో ఇండియా రెండో టెస్టు
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే