డునెడిన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి కీలకమైన ఐదు వికెట్లు తీశాడు. అయితే మిల్నే వేసిన తొలి ఓవర్లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోవడం మొత్తం మ్యాచ్కు హైలెట్. ఇలా జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని క్రీడా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
https://twitter.com/sparknzsport/status/1643422506500636673
ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే అద్భుతమైన బౌలిండ్ కు లంక జట్టు 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్‌లో జరుగనుంది.