ప్రపంచ కప్ లో పెను సంచలనం..4 ఓవర్లూ మెయిడిన్‌‌‌‌‌‌‌‌ చేసిన న్యూజిలాండ్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 ప్రపంచ కప్ లో పెను సంచలనం..4 ఓవర్లూ మెయిడిన్‌‌‌‌‌‌‌‌ చేసిన న్యూజిలాండ్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     7 వికెట్లతో గినియాపై కివీస్‌‌‌‌ గెలుపు

తరౌబా : న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్‌‌‌‌ (4-–4–0–3) టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. పపువా న్యూ గినియాతో సోమవారం జరిగిన గ్రూప్‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌లో తన కోటాలోని నాలుగు ఓవర్లనూ మెయిడిన్ చేసి ఔరా అనిపించాడు. మూడు వికెట్లు కూడా పడగొట్టిన అతను  వరల్డ్ కప్‌‌‌‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేసిన బౌలర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు.  ఇదే వేదికపై మూడు రోజుల కిందట ఉగాండాపై తన టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ టిమ్ సౌథీ (3/4) నెలకొల్పిన రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు.

మొత్తంగా ఇంటర్నేషనల్  టీ20ల్లో నాలుగు ఓవర్లనూ మెయిడిన్‌‌‌‌ చేసిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌ ఫెర్గూసన్‌‌‌‌. కెనడా బౌలర్‌‌‌‌‌‌‌‌ సాద్ బిన్ జాఫర్ (4–4–0–2) 2021లో పనామాపై తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఫెర్గూసన్‌‌‌‌ జోరుతో  కివీస్  7  వికెట్ల తేడాతో గినియాను ఓడించింది. తొలుత  గినియా 19.4 ఓవర్లలో 78 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. చార్లెస్ అమిని (17) టాప్ స్కోరర్.  టిమ్ సౌథీ, ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, ఇష్ సోథీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత కివీస్‌‌‌‌ 12.2  ఓవర్లలో 79/3   స్కోరు చేసి గెలిచింది.  

ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌ (0), రచిన్ రవీంద్ర (6) ఫెయిలైనా డెవాన్ కాన్వే (35), డారిల్ మిచెల్‌‌‌‌ (19 నాటౌట్‌‌‌‌), కేన్ విలియమ్సన్ (18 నాటౌట్‌‌‌‌)  రాణించారు. ఫెర్గూసన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  సూపర్‌‌‌‌–‌‌‌‌8 రేసు నుంచి ముందుగానే తప్పుకున్న న్యూజిలాండ్‌‌‌‌ 4 పాయింట్లతో గ్రూప్‌‌‌‌–సిలో మూడో స్థానంతో టోర్నీని ముగించింది.