IPL 2025: ఐపీఎల్‌ కోసం పాకిస్థాన్ టీ20 సిరీస్ వద్దనుకున్న ఆరుగురు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు

IPL 2025: ఐపీఎల్‌ కోసం పాకిస్థాన్ టీ20 సిరీస్ వద్దనుకున్న ఆరుగురు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు

ఐపీఎల్ కోసం న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు జాతీయ జట్టును కాదనుకున్నారు. ఐపీఎల్ కమిట్మెంట్ ల కారణంగా కివీస్ స్టార్ క్రికెటర్లు పాకిస్థాన్ తో మార్చి 16 నుంచి జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. పాకిస్థాన్ తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్ కోసం కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తో సహా ఆరుగురు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు హోమ్ సిరీస్ కు దూరంగా ఉన్నారు. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో న్యూజిలాండ్ కెప్టెన్ గా బ్రేస్ వెల్ ఎంపికయ్యాడు. ఐపీఎల్ కోసం పాకిస్థాన్ సిరీస్ కాదనుకున్న కివీస్ ఆటగాల్లెవరో ఇప్పుడు చూద్దాం.          

మిచెల్ సాంట్నర్ (ముంబై ఇండియన్స్): న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 2025 ఐపీఎల్ లో ముంబైగా ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత బౌలింగ్ తో 9 వికెట్లు పడగొట్టిన సాంట్నర్ ముంబై జట్టులో కీలక ప్లేయర్ గా మారనున్నాడు. సాంట్నర్ ను 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 2 కోట్ల కనీస ధరకు ముంబై దక్కించుకుంది. 

డెవాన్ కాన్వే (చెన్నై సూపర్ కింగ్స్): న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే చెన్నై సూపర్ కింగ్స్ తరపున మరోసారి ఆడడానికి సిద్ధమయ్యాడు. కాన్వేను 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ.6.25 కోట్ల కనీస ధరకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గాయం కారణంగా 2024 ఐపీఎల్ సీజన్ కు కాన్వే దూరంగా ఉన్నాడు.   
        
లాకీ ఫెర్గూసన్ (పంజాబ్ కింగ్స్): గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఆడిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ సారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫెర్గూసన్ ను 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ.2 కోట్ల కనీస ధరకు పంజాబ్ కింగ్స్  దక్కించుకుంది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ కివీస్ పేసర్ ఆడలేదు.   

Also Read:-RCB కి అదిరిపోయే వార్త.. గాయపడిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఫిట్..

 గ్లెన్ ఫిలిప్స్ (గుజరాత్ టైటాన్స్): ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న గ్లెన్ ఫిలిప్స్ 2025 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడనున్నాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ లో ఉన్న ఫిలిప్స్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫిలిప్స్ ను 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ.2 కోట్ల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. 

రచిన్ రవీంద్ర (చెన్నై సూపర్ కింగ్స్): 2024లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర మరోసారి అదే జట్టుతో తరపున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రచిన్ రవీంద్రను 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ.4 కోట్ల ధరకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 

బెవాన్ జాకబ్స్ (ముంబై ఇండియన్స్) – న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన ఈ కివీస్ ఆల్ రౌండర్ తొలిసారి ఐపీఎల్ కాంట్రాక్టును దక్కించుకున్నాడు. రూ. 30 లక్షలతో అతను ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు.