ప్రపంచంలో కరోనా కేసులతో పాటు.. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. దాంతో పలు దేశాలు ఒమిక్రాన్ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. న్యూజిలాండ్‌లో కూడా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల దృష్ట్యా.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేయడంతో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ ఆదివారం తన స్వంత వివాహాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. కరోనా కొత్త ఆంక్షలను తెలిపిన తర్వాత.. తన వివాహాన్ని మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండు డోసుల టీకాలు తీసుకున్న 100 మంది వ్యక్తులతో వివాహం చేసుకోవచ్చు.. కానీ, తాను ఆ అవకాశాన్ని కూడా వాడుకోవాలనుకోవడం లేదని ఆమె తెలిపారు. ఆర్డెర్న్, ఆమె భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్ వారి వివాహం తిరిగి ఎప్పుడు జరిగేది ఇంకా ప్రకటించలేదు.
నా పెళ్లికి హాజరయ్యేందుకు వస్తున్న వారిలో తొమ్మిది మందికి ఒమిక్రాన్ సోకింది. అంతేకాకుండా.. వారు ప్రయాణించిన విమాన అటెండెంట్‌కు కూడా ఇన్‌ఫెక్షన్ రావడంతో న్యూజిలాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ‘రెడ్ సెట్టింగ్’ఆంక్షలను విధించవలసి వచ్చింది. ఒమిక్రాన్ మునుపటి డెల్టా వేరియంట్ కంటే చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే ఇది ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురిచేసే అవకాశం తక్కువ. జనాలు సమూహాలుగా ఉండకుండా.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మహమ్మారి వల్ల ఇబ్బందిపడిన వారిలో నేను ఒకరిని. అయితే ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ప్రియమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారితో ఉండలేకపోవడం. అది అన్నింటికంటే పెద్ద బాధ’ అని జసిండా అన్నారు.
For More News..