ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జోరు కొనసాగుతుంది. తొలి మ్యాచులో ఇంగ్లాండ్ బౌలర్లని చితక్కొట్టిన కివీస్ నేడు ప్రస్తుతం నెదర్లాండ్స్ తో జరుగుతున్న రెండో మ్యాచులో భారీ స్కోర్ నమోదు చేసింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను 322 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తొలి మూడు ఓవర్లలలో ఒక్క పరుగు కూడా రాకపోయినా ఆ తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. 32 పరుగులు చేసి ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కాన్వే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన రచీన్ రవీంద్రతో కలిసి మరో ఓపెనర్ విల్ యంగ్ స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లాడు. యంగ్ 70 పరుగులు చేసి అవుట్ కాగా.. రవీంద్ర 51 పరుగులు చేసాడు.
- ALSO READ | Cricket World Cup 2023: ఇండియా నుంచి వెళ్లిపోయిన జైనాబ్.. భారత్ పై ఏడుస్తున్న పాక్ మీడియా
ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ టామ్ లాతమ్ 53, డారిల్ మిచెల్ 48 పరుగులు చేసి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లోనే 36 పరుగులు చేసి జట్టు స్కోర్ ని 300 పరుగులు దాటించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకరన్, ఆర్యన్ దత్, వాండెర్ మెర్వ్ తలో రెండు వికెట్లు దక్కాయి.