NZ vs SA: కేన్, రచీన్ సెంచరీలు: గడాఫీలో న్యూజిలాండ్ పరుగుల వరద.. సౌతాఫ్రికా ముందు బిగ్ టార్గెట్

NZ vs SA: కేన్, రచీన్ సెంచరీలు: గడాఫీలో న్యూజిలాండ్ పరుగుల వరద.. సౌతాఫ్రికా ముందు బిగ్ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో దుమ్ములేపింది. ఓపెనర్ రచీన్ రవీంద్ర (101 బంతుల్లో 108:13 ఫోర్లు, ఒక సిక్సర్) వెటరన్ ప్లేయర్ కేన్ విలియంసన్ (94 బంతుల్లో 102:10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచీన్ రవీంద్ర 108 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. రబడా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్డర్ కు ఒక వికెట్ దక్కింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్లు యంగ్, రచీన్ రవీంద్ర డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 48 పరుగులు జోడించి మంచి శుభారంభం అందించారు. 21 పరుగులు చేసిన యంగ్ ను ఎంగిడి ఒక చక్కటి బంతితో పెవిలియన్ కు చేర్చాడు. ఈ దశలో రచీన్ రవీంద్రకు జత కలిసిన విలియంసన్ భారీ భాగస్వామ్యంతో సౌతాఫ్రికా బౌలర్లను విసిగించారు. ఇద్దరూ పోటాపోటీగా ఆడడంతో పరుగులు వేగంగా వచ్చాయి. రెండో వికెట్ కు ఈ జోడీ ఏకంగా 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ALSO READ | IND vs AUS: హెడ్ వికెట్ క్రెడిట్ కొట్టేసిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్!

ఈ క్రమంలో 93 బంతుల్లో సెంచరీ చేసుకున్న రచీన్ రవీంద్ర ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న విలియంసన్ వేగంగా ఆడుతూ వన్డే కెరీర్ లో 15 వ సెంచరీని పూర్తి చేసుకొని ఔటయ్యాడు. టాప్ ఆర్డర్ లో మంచి  ఈ దశలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వేగంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ ను 350 పరుగులకు చేర్చారు. మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఫిలిప్స్ 27 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.