New Zealand Cricket: సమ్మర్ షెడ్యూల్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్

New Zealand Cricket: సమ్మర్ షెడ్యూల్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్

న్యూజిలాండ్ మెన్స్ క్రికెట్ జట్టు షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు జరగబోయే సమ్మర్ షెడ్యూల్ ను బుధవారం (జూలై 17) ప్రకటించింది. ఈ మ్యాచ్ లన్నీ కివీస్ తమ సొంతగడ్డపై కొన్ని.. పాకిస్థాన్ లో మరికొన్ని సిరీస్ లు ఆడుతుంది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో ప్రారంభమవుతుంది.

నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు తొలి టెస్ట్.. డిసెంబర్ 6 నుంచి 10 వరకు రెండో టెస్ట్.. డిసెంబర్ 14 నుంచి 18 వరకు మూడో టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 28 నుంచి శ్రీలంక జట్టుకు ఆతిధ్యం ఇవ్వనుంది. 3 వన్డేలు.. 3 టీ20 ల ఈ టూర్ జనవరి 11 తో ముగుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ముక్కోణపు సిరీస్ కోసం పాకిస్థాన్ లో పర్యటిస్తుంది. పాకిస్థాన్ తో పాటు దక్షిణాఫ్రికా మరో జట్టు. ఈ ట్రయాంగిల్ సిరీస్ తర్వాత ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. 

ALSO READ | ENG v WI 2024: 12 ఏళ్ళ తర్వాత తొలిసారి.. ఇంగ్లాండ్‌కు గుడ్ బై చెప్పిన దిగ్గజాలు

మార్చి, ఏప్రిల్ లో పాకిస్థాన్ తో 5 టీ20 మ్యాచ్ లు.. 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత న్యూజిలాండ్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ టోర్నీలో సూపర్ 8 దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అక్టోబర్ లో 3 టెస్టు మ్యాచ్ లు ఆడడానికి భారత్ లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.