
వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో తడబడింది. గ్లెన్ ఫిలిప్స్ (77), మ్యాట్ హెన్రీ (42) మాత్రమే రాణించడంతో.. శుక్రవారం రెండో రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 179 రన్స్‌కే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు నేథన్ లైయన్ (4/43), హాజిల్‌వుడ్ (2/55) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ టాప్ ఆర్డర్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 13/2 స్కోరు చేసింది. ఖవాజ (5 బ్యాటింగ్), లైయన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.